అమరావతి ముచ్చట్లు:
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్సోజెండర్ల సంక్షేమం కోసం స్టేట్ వెల్ఫేర్ బోర్డును పునర్నిర్మించింది. విశాఖ, తిరుపతి కలెక్టర్లతో పాటు ముగ్గురు ట్రాన్సో జెండర్ ప్రతినిధులను సభ్యులుగా నియమిస్తూ జీఓ 14 విడుదల చేసింది. రెండేళ్ల పదవీకాలం ఉండే ఈ బోర్డు ద్వారా విద్య, ఉపాధి, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యమని చంద్రబాబు సర్కార్ పేర్కొంది. ప్రాంతీయ స్థాయిలో సమస్యల పరిష్కారానికి ఇది దోహదపడనుంది.
Tags: Government Takes Key Decision for Transgender Welfare in AP