May 13, 2026
Explore
గోల్డెన్ డోమ్’పై పెరుగుతున్న వివాదం

గోల్డెన్ డోమ్’పై పెరుగుతున్న వివాదం

May 13, 2026 | Andhra Pradesh

– 7,800 ఉపగ్రహాలతో అంతరిక్ష రక్షణ వ్యవస్థ?

వాషింగ్టన్ ముచ్చట్లు:

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన “గోల్డెన్ డోమ్” క్షిపణి రక్షణ ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం (సిబివో) అంచనా ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌కు వచ్చే 20 ఏళ్లలో 1.2 ట్రిలియన్ డాలర్ల వరకు ఖర్చవొచ్చని పేర్కొంది. ఈ వ్యవస్థలో భూమి ఆధారిత రక్షణతో పాటు, అంతరిక్షంలో భారీ స్థాయిలో ఉపగ్రహాలను మోహరించే ప్రణాళిక ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సుమారు 7,800 అంతరిక్ష ఇంటర్‌సెప్టర్ ఉపగ్రహాలు ఇందులో భాగమయ్యే అవకాశం ఉందని సమాచారం. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో దాదాపు 70 శాతం ఖర్చు ఈ స్పేస్ వ్యవస్థలపైనే అయ్యే అవకాశముందని సిబివో అంచనా వేసింది. అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు భూమి, అంతరిక్ష ఆధారిత రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ వ్యవస్థకు ఇజ్రాయిల్ యొక్క “ఐరన్ డోమ్” రక్షణ వ్యవస్థ ప్రేరణగా నిలిచిందని తెలుస్తోంది. అయితే, రష్యా లేదా చైనా వంటి శక్తివంతమైన దేశాల నుంచి భారీ స్థాయి దాడి జరిగితే.

Tags: Growing Controversy Over the ‘Golden Dome’