May 13, 2026
Explore
కురబలకోట మండలంలో లారీ అగ్నిప్రమాదం

కురబలకోట మండలంలో లారీ అగ్నిప్రమాదం

May 13, 2026 | Andhra Pradesh

కురబలకోట ముచ్చట్లు:

కురబలకోట మండలం కంటేవారిపల్లి సమీపంలో మంగళవారం రాత్రి పేపర్ లోడ్‌తో చెన్నై వెళ్తున్న లారీకి ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా లారీ టైర్లు పేలిపోవడంతో మంటలు చెలరేగాయి.

ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమై లారీ నుంచి కిందికి దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం మంటలు వేగంగా వ్యాపించి లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిసింది.

Tags: Lorry Fire Accident in Kurabalakota Mandal