May 13, 2026
Explore
ఏడు నెలల గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి

ఏడు నెలల గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి

May 13, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి మండలం చేన్నముక్కపల్లి గ్రామంలోని రాజుల కాలనీలో ఏడు నెలల గర్భిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. గంగనేరు గ్రామానికి చెందిన షేక్ రెహాబ్ జాన్(24)కు తొమ్మిది నెలల క్రితం రాయచోటికి చెందిన షేక్ రెడ్డి బాషాతో వివాహం జరిగింది. సోమవారం రాత్రి ఆమె మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేసేవాడని భర్తపై గర్భిణి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: Seven-month pregnant woman dies under suspicious circumstances.