పీలేరు ముచ్చట్లు:
పీలేరు మండలం రేగల్లు గ్రామపంచాయతీ పరిధిలో రైతులు సాగు చేస్తున్న ఉద్యాన పంటలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. రైతు శ్రీకాంత్ రెడ్డి సాగు చేస్తున్న 15 ఎకరాల మామిడి తోటను సందర్శించి పండ్ల రక్షణ కోసం ఏర్పాటు చేసిన కవర్లను పరిశీలించారు. దిగుబడి, మార్కెట్ ధరలు, సాగు పరిస్థితులపై రైతుతో మాట్లాడారు.
అనంతరం రైతు కుమార్ నాయుడు సాగు చేస్తున్న టమాటా తోటను పరిశీలించి పంట యాజమాన్యం, చీడపీడల నివారణ, ఎరువుల వినియోగం, దిగుబడి అంశాలపై వివరాలు తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు.
Tags: The Collector inspected the mango and tomato orchards.