రాయచోటి ముచ్చట్లు:
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతులకు చేయూతనిస్తూ వ్యవసాయ యాంత్రికరణకు ప్రాధాన్యత ఇస్తోందని రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటి మార్కెట్ యార్డులో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌కు ముందే పంట కోత యంత్రాలు, పవర్ టిల్లర్స్, నూర్పిడి యంత్రాలు వంటి ఆధునిక పరికరాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
అన్నమయ్య జిల్లాకు యాంత్రికరణ పథకం కింద రూ.1.70 కోట్లు కేటాయించగా, 472 మంది రైతులకు పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. రైతులు ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Tags: The Coalition Government is Extending a Helping Hand to Farmers: Ramprasad Reddy