రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి పట్టణంలో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలతో ప్రమాదకర ఫీట్లు, అధిక శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న యువకులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వాహనాల అద్దాలు ధ్వంసం చేస్తున్న ఘటనలను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు.
రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి.వి. చలపతి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను రాత్రి వేళల్లో అనవసరంగా బయట తిరగనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
Tags: Police keep special vigil on midnight riots