May 13, 2026
Explore
కాంగోలో అన్నమయ్య జిల్లా యువకుడి మృతి

కాంగోలో అన్నమయ్య జిల్లా యువకుడి మృతి

May 13, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

కాంగోలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. అన్నమయ్య జిల్లా కలిచెర్ల గ్రామానికి చెందిన పి. శ్రీకాంత్ రెడ్డి (34) గత 11 ఏళ్లుగా కాంగోలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా ఆయనకు గుండెపోటు రావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. మృతదేహం మూడు రోజుల తర్వాత భారత్‌కు చేరుకోనుంది.

Tags: Youth from Annamayya District Dies in Congo