May 13, 2026
Explore
AISF శిక్షణా తరగతుల కరపత్రాల విడుదల

AISF శిక్షణా తరగతుల కరపత్రాల విడుదల

May 13, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లిలోని STU కార్యాలయంలో AISF జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతుల కరపత్రాలను రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, జిల్లా నిర్మాణ బాధ్యులు పి. మహేశ్ విడుదల చేశారు. జూన్ 9,10 తేదీలలో హార్స్లీ హిల్స్లో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యారంగ సమస్యలు, నూతన విద్యావిధానం, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలపై చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు. విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేసి ప్రభుత్వ విద్యాసంస్థల పరిరక్షణ కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.

Tags: Release of AISF Training Class Pamphlets