లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు:
లక్కిరెడ్డిపల్లి మండలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల వివరాలను తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలని ఎస్సై శోభ సూచించారు. భవన నిర్మాణ కార్మికులు, హోటళ్లు, ఇటుక బట్టీలు, లాడ్జీలు, వ్యాపార సంస్థల యజమానులు రెండు మూడు రోజుల్లోగా కార్మికుల పూర్తి వివరాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి నమోదు చేయాలని తెలిపారు. భద్రతా పరమైన కారణాల దృష్ట్యా ఈ ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
Tags: Details of migrant workers must be registered: SI