May 12, 2026
Explore
నా శవాన్ని కుక్కలకు వదిలేయండి”

నా శవాన్ని కుక్కలకు వదిలేయండి”

May 12, 2026 | Andhra Pradesh

ఆళ్లగడ్డ ముచ్చట్లు:

ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పడకండ్లకు చెందిన చిరంజీవి(25) ఆత్మహత్య ఘటన కంటతడి పెట్టిస్తోంది. పుట్టుకతోనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతడిని బతికించేందుకు తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేశారు. అయితే తన వల్ల కుటుంబానికి భారమేనని భావించిన చిరంజీవి.. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. “ఉరిశిక్ష పడిన వారికి కూడా చివరి కోరిక ఇస్తారు. అలాగే నాకూ ఓ కోరిక ఉంది. నా చివరి కోరిక తీర్చండి. నేను చనిపోయాక నా శవాన్ని కుక్కలకు ఆహారంగా వేయండి. లేకపోతే ఎక్కడైనా చెత్త కుప్పలోనైనా పడేయండి. నా శవాన్ని అమ్మానాన్నలకు ఇవ్వొద్దు.. నా శవాన్ని చూసి వారు తట్టుకోలేరు. వారి ఆవేదన, బాధ నేను ఊహించలేను. ఇక సెలవు..” అంటూ రాసిన సూసైడ్ నోట్ కంటనీరు తెప్పించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Leave my corpse to the dogs.