మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇద్దరు విద్యార్థులు కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. సోమవారం రాత్రి జరిగిన ఘటనపై వివరాలు.. స్థానిక బొంబు బజారులో కాపురం ఉంటున్న అమీర్ బాష కొడుకు ఆఫ్సాన్(20), తాళ్ల సుబ్బన్న కాలనీలో కాపురం ఉంటున్న షమీవుల్లా కొడుకు సాదిక్(22), మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న విశ్వహిత డిగ్రీ కళాశాలలో చదువు కుంటున్నారు. ఇద్దరు శేష మహల్ కు దక్షిన వైపున ఉన్న మడికయల్లోకి సరదాగా వెళ్లి గొడవ పడ్డారు. ఇద్దరు ముందుగానే వెంట తెచ్చుకున్న కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో గాయపడిన బాధితులను స్థానికులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించగా కోలుకుంటు ఉన్నారు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Tags: Students stabbed each other with knives.