మదనపల్లె ముచ్చట్లు:
మహిళా సంఘాల పొదుపు డబ్బుతో మదనపల్లెకు చెందిన ఆర్ పి జ్యోతి కోటి రూపాయలకు పైగా స్వాహా చేసి పరారైన ఘటన మదనపల్లెలో సోమవారం కలకలం రేపింది.మదనపల్లి పట్టణం, సీటీఎం రోడ్డు, ఎస్టేట్ సమీపంలో నివాసం ఉంటున్న ఆర్పీ జ్యోతి దాదాపు 20 డ్వాక్రా సంఘాల కు చెందిన మహిళల నుంచి పొదుపు చేసిన కోటి రూపాయలకు పైగా డబ్బును తీసుకుని నెల రోజులుగా పరార్ లో ఉంది. జ్యోతి ఇంటి చుట్టూ, బంధువుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. వారి డబ్బు వారికి తిరిగి రాకపోవడంతో బాధిత మహిళలు సోమవారం రాత్రి స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.న్యాయం చేయాలని కోరుతూ ఎస్ఐ కి ఫిర్యాదు చేశారు. జ్యోతి మా సంఘాల డబ్బు.
Tags: RP Jyothi embezzles ₹1 crore belonging to savings groups in Madanapalle.