పుంగనూరుముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నీట్‌యూజి పరీక్షలు రద్దు చేయడంతో గ్రామీణ స్థాయి నుంచి ఆందోళలను ప్రారంభమైంది. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని తల్లిదండ్రులు, విద్యార్థులు , మేదావి వర్గం మండిపడుతున్నారు.
నీట్ పరీక్షల్లో నిర్లక్షం…
నీట్‌యూజి పరీక్ష రద్దు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనౌతున్నారు. ప్రభుత్వ నిర్లక్షమే నీట్ పేపర్లు లీక్ కావడంతో నీట్‌గా పరీక్షల నిర్వహణ చేయలేదని రుజువౌతోంది. దీని కారణంగా నిజాయితీగా పరీక్షలు రాసిన విద్యార్థులు ఆపరీక్షలను రద్దు చేయడంతో కష్టపడి చదివిన విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనౌతున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండ చర్యలు తీసుకోవాలి.

- కిషోర్‌కుమార్‌రెడ్డి, ఎస్టీయు అన్నమయ్యజిల్లా అసోసియేట్ అధ్యక్షుడు, పుంగనూరు.
విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమే….
కేంద్ర ప్రభుత్వం నిర్లక్షం కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతోంది. నీట్ పరీక్షల నిర్వహణలో ప్రతి సారి వైఫల్యం కావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షల్లో పారదర్శకత లేకపోవడంతో ఆక్రమాలు జరగడం , పేపర్లు లీక్ కావడం జరుగుతోంది. ఇకనైన ప్రభుత్వం ఇలాంటి ఉన్నతమైన పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి.

- బుడ్డన్న, ఎస్టీయు మండల అధ్యక్షుడు, పుంగనూరు.
Tags: Anxiety over NEET exams