పుంగనూరుముచ్చట్లు:
బాల్యవివాహాలను చేసిన , ప్రోత్సహించిన నేరస్తులౌతారని ఐసిడిఎస్ సూపర్‌వైజర్ సుగుణ , చైల్డ్ ప్రోటెక్షన్ ఆఫీసర్ రామలక్ష్మీలు తెలిపారు. మంగళవారం వెహోదుగులపల్లెలో తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సుగుణ మాట్లాడుతూ మైనర్ బాలికలను లైంగికంగా వేదించిన శిక్షలు తప్పవన్నారు. బాలికల సంరక్షణ, పరిశుభ్రత, పౌష్ఠికాహారం తదితర విషయాలపై తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
Tags: Child marriage is a crime.