పన్నుదారులకు మున్సిపాలిటి షాక్
పుంగనూరుముచ్చట్లు:
ఏళ్ల తరబడి పన్నులు చెల్లించకుండ మున్సిపాలిటి సౌకర్యాలు పొందుతున్న వారికి మున్సిపాలిటి షాక్ ఇచ్చింది. మంగళవారం పట్టణంలోని విబిఎస్ ఫంక్షన్‌హాల్ యాజమాన్యం పన్ను చెల్లించకపోవడంతో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్‌రెడ్డి ఆదేశాలమేరకు శానిటరీ అధికారులు చెత్తను ట్రాక్టర్‌లో తీసుకొచ్చి ఫంక్షన్‌హాల్ ముందు పడేశారు. పన్నులు చెల్లించేంత వరకు చెత్తను తొలగించేది లేదని అధికారులు హెచ్చరించారు. దీని కారణంగా పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలిగిన పన్నులు చెల్లించని యాజమాన్యంపై ప్రజలు మండిపడ్డారు.
Tags: If you don’t pay your taxes… we will dump garbage in front of your house.