పుంగనూరుముచ్చట్లు:
వేసవి తీవ్రంగా ఉండటంతో చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. మండలంలోని పట్రపల్లె తాండాకు చెందిన గణేష్‌నాయక్ కుమారుడు వరుణ్‌నాయక్(14), అలాగే మణి నాయక్ కుమారుడు నిలేష్‌నాయక్(8) ఇద్దరు కలసి బడిగిరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు మధ్యాహ్నం వెళ్లారు. ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లి ఇద్దరు మునిగిపోయారు. సమీపంలో బాతులు మేపుతున్న యువకులు గమనించి గ్రామస్తులకు తెలిపారు. అందరు కలసి హుఠాహుటిన ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.

Tags: Two Children Drown While Swimming in Summer