పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని పలు సీతారామాలయాలలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా భక్తిశ్రద్దలతో నిర్వహించారు. పట్టణంలోని కోనేటి వద్ద వెలసియున్న ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం, హనుమంతరాయునిదిన్నెలో గల శ్రీ ఆంజనేయస్వామి ఆలయము, సుబ్బమ్మ చెరువు వెహోరవ వద్ద గల శ్రీ ఆంజనేయస్వామి ఆలయము, తోపుమఠం, అరవపల్లె వద్ద గల శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలలో పూజలు నిర్వహించారు. వేకువజామున స్వామివారి మూలవిరాట్‌కు అభిషేక కార్యక్రమాలు నిర్వహించి, పూలతో అలంకరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా రామకోటితో పాటు సుందరఖాండ పారాయణం చేసి , అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
Tags: Hanuman Jayanti Celebrated with Devotion and Reverence