March 19, 2026
Explore
శ్రీపరాభవనామ సంవత్సర ఉగాధి వేడుకలు

శ్రీపరాభవనామ సంవత్సర ఉగాధి వేడుకలు

March 19, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర ఉగాధిని పురస్కరించుకుని హిందూవులు అందరు ఘనంగా ఉగాధి సంబరాలు నిర్వహించారు. గురువారం వేకువజాము నుంచి పట్టణంలోని కోనేటి వద్ద గల శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, గూడూరుపల్లె వద్ద గల శ్రీ లక్ష్మీనరసింహస్వామిఆలయం, మండలంలోని ఏడూరులో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, బస్టాండ్‌ సమీపంలో గల శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయంతో పాటు , శివాలయాలు, గంగమ్మ ఆలయాలలో భక్తులు నూతన వస్త్రలు ధరించి, ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలలో పంచాంగశ్రావణం చేసి , భక్తులకు మామిడి , వేప, బెల్లం, చింతపండు కలిపిన ప్రసాదాలను పంపిణీ చేశారు. తెలుగు ప్రజలందరు తమ ఇండ్లలో పూజలు చేసి, ఉగాధి పచ్చళ్లు స్వీకరించారు. పిత్రుదేవతలు, పంటపొలాల్లోకి వెళ్లి పూజలు చేశారు.

Tags: Ugadi Celebrations of the Year Sri Parabhava