– ₹97 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
అనకాపల్లి ముచ్చట్లు:
అనకాపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బుచ్చయ్యపేట పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పట్టుకున్న వివరాలను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మీడియా సమావేశంలో వెల్లడించారు.
గత ఏడాదిన్నర కాలంగా గంజాయి నియంత్రణలో పురోగతి:
ఈ సందర్భంగా ఎస్పీ జిల్లాలో గంజాయి నియంత్రణపై కీలక గణాంకాలను వెల్లడించారు:
రవాణా తగ్గుదల: గత ఏడాదిన్నర నుండి రెండేళ్ల కాలంలో జిల్లాలో గంజాయి రవాణా గణనీయంగా తగ్గింది.
నమోదైన కేసులు: ఈ ఏడాది ఇప్పటివరకు 46 కేసులు నమోదు చేసి, మొత్తం 1,177 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది.
హషీష్ ఆయిల్: 7.14 లీటర్ల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నాము. నిందితులు గంజాయి కంటే హషీష్ ఆయిల్ రవాణా సులభమని భావించి అటువైపు మళ్లుతున్నట్లు గుర్తించాము.
శిక్షలు (Convictons): ప్రాసిక్యూషన్ విభాగంతో సమన్వయం ద్వారా ఈ ఏడాది 13 కేసుల్లో 24 మందికి శిక్షలు పడేలా చేశాము. ఇందులో 16 మందికి 10 నుండి 15 ఏళ్ల జైలు శిక్ష పడటం ఒక పెద్ద మార్పు.
ఆస్తుల జప్తు: ఎన్.డి.పి.ఎస్ (NDPS) కేసుల్లో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇప్పటివరకు ₹1.25 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశాము.
ప్రస్తుత ఘటన వివరాలు:
తేదీ 11.05.2026 మధ్యాహ్నం సుమారు 15:00 గంటల సమయంలో, ఈగిల్ టీమ్, స్పెషల్ బ్రాంచ్ మరియు బుచ్చయ్యపేట పోలీసులు బంగారుమెట్ట – అనకాపల్లి రోడ్డులోని గొన్నవానిపాలెం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో అనకాపల్లి వైపు వేగంగా వస్తున్న ఒక స్కూటీ మరియు మారుతి సియాజ్ కారును అడ్డగించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు మరియు స్వాధీనం:
నిందితులు: A-1 గుమ్మాల పేరునాయుడు, బైలపూడి గ్రామం, చీడికాడ మండలం. (ప్రధాన రవాణాదారు – గతంలో 6 కేసులు ఉన్నాయి),
A-2 మండిపల్లి సత్తిబాబు (సాగుదారు), గజ్జేడు గ్రామం, పెదబయలు మండలం, ASR జిల్లా.
A-3 గొల్లవెల్లి గణేష్ (డ్రైవర్), బైలపూడి గ్రామం, చీడికాడ మండలం.
స్వాధీనం చేసుకున్న సొత్తు: 194 కేజీల గంజాయి (విలువ ₹97 లక్షలు), ఒక మారుతి సియాజ్ కారు, ఒక స్కూటీ మరియు 03 మొబైల్ ఫోన్లు.
ఎస్పీ గారి హెచ్చరిక & ప్రజలకు విజ్ఞప్తి:
అనకాపల్లి జిల్లా పోలీసులు గంజాయి మరియు డ్రగ్స్ పట్ల ‘జీరో టాలరెన్స్’ పాలసీని అనుసరిస్తున్నారని ఎస్పీ గారు స్పష్టం చేశారు. మీ ప్రాంతంలో ఎవరైనా గంజాయి వినియోగిస్తున్నా లేదా విక్రయిస్తున్నా వెంటనే 112 లేదా 1972 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.
ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి, కొత్తకోట సిఐ జి.కోటేశ్వరరావు, కొత్తకోట ఎస్సై ఎం.శ్రీనివాస్, బుచ్చయ్యపేట ఎస్సై ఏ.శ్రీనివాసరావు మరియు వారి సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలు నగదు రిర్డులను అందజేశారు.
Tags: Massive Ganja Smuggling Racket Busted