అమరావతిముచ్చట్లు:
కొత్త వాహనాలకు 24 గంటల్లో శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తయ్యే విధానం అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
👉 డీలర్ వద్ద తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన వాహనానికి, రవాణా అధికారులు నిర్దేశిత గడువులోగా ఆమోదం, తిరస్కరణ, అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా నమోదు వంటివి చేయాలి. ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే, ఆ తర్వాత దరఖాస్తు ఆమోదం పొందినట్లే (డీమ్డ్ టు అప్రూవల్) అనే విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొంది.
👉 అందుకు తగ్గట్లు ఎన్ఐసీతో సమన్వయం చేసుకొని, వాహన్ పోర్టల్లో మార్పులు చేయాలని రవాణాశాఖ కమిషనరు ఆదేశించింది.
👉 ఈ మేరకు రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Tags; Permanent Registration for New Vehicles Within 24 Hours