రాజంపేట ముచ్చట్లు:
రాజంపేటలో టిడిపి కార్యకర్తలపై దాడులు చేయడం వైకాపా పిరికితనానికి నిదర్శనమని నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు విమర్శించారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో వైకాపా యువత దాడిలో గాయపడిన టిడిపి సానుభూతిపరులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. దేవాలయ భూముల ఆక్రమణను అడ్డుకున్న గ్రామస్తులపై దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ, భూములను కాపాడేందుకు టిడిపి కట్టుబడి ఉందన్నారు.
Tags: We Will Not Tolerate Attacks on TDP Cadres: Chamarthi Jagan Mohan Raju