నందలూరుముచ్చట్లు:
నందలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈదరపల్లి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.
బీసీ కాలనీ స్థలాన్ని ఆక్రమించారని పలుమార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాలనీ స్థలాన్ని కాపాడి ఆక్రమణను తొలగించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు MRO కార్యాలయాన్ని తెరవనివ్వబోమని స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఈదరపల్లి గ్రామస్థులు హెచ్చరించారు.
Tags: Idarapalli villagers protest against encroachment of BC Colony land.