చంద్రగిరిముచ్చట్లు:
చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్‌రోడ్డులో కోళ్ల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. భాకరాపేట నుంచి తిరుపతి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
లారీ బోల్తా పడటంతో అందులో ఉన్న కోళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో సమీప గ్రామస్తులు, అటుగా వెళ్తున్న వాహనదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని రోడ్డుపై పడిపోయిన కోళ్లను ఎత్తుకెళ్లారు.
స్థానికుల సహాయంతో బోల్తా పడిన లారీని డ్రైవర్ అక్కడి నుంచి తొలగించినట్లు సమాచారం.
ఘాట్‌రోడ్డులో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సిన అవసరం ఉంది.
Tags:Chicken-laden lorry overturns on Bhakarapeta Ghat Road.