మదనపల్లె ముచ్చట్లు:
-రూ.10లక్షలకు పైగా ఆస్తినష్టం..
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లి లో ఉన్న గుజిరిలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగి పది లక్షల ఆస్తి నష్టం సంభవించింది. మదనపల్లి అగ్నిమాపక అధికారి శివప్ప గుడి యజమాని చల్లా శివ తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లి నీరుగట్టువారి పల్లిలో కాపురం ఉంటున్న శివ, చౌడేశ్వరి కళ్యాణ మండపం కు సమీపంలో గత కొన్నిల్లుగా గుజరి దుకాణం నిర్వహిస్తున్నాడు. సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూటివ్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, కుదిరిలో ఉన్న అట్టలు పేపర్ అల్యూమినియం కాపర్ ఇనుము ఇతరత్రా సామాగ్రి మంటల్లో ఖాళీ బూడిదైంది.
Tags: Fire accident at Neerugattupalle scrap yard