పీటీఎం ముచ్చట్లు:
పీటీఎం మండలం పులికల్లు గ్రామానికి చెందిన అభిషేక్(25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మూడు నెలల క్రితం కర్ణాటకలోని నల్లగుట్లపల్లె సమీప గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్న అభిషేక్, ఆదివారం భార్యతో కలిసి అత్తారింటికి వెళ్లాడు. అనంతరం స్నేహితుడితో కలిసి చేలూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా నల్లగుట్లపల్లె మలుపు వద్ద కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
Tags: Young man dies just three months after marriage.