May 11, 2026
Explore
సైన్స్ ప్రయోగాలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపు

సైన్స్ ప్రయోగాలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపు

May 11, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు “సైన్స్ ప్రయోగాలు మరియు కృత్యాలు” అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ మధుసూదన్ రాజు సైన్స్ ప్రయోగాలను ప్రత్యక్షంగా చేసి శాస్త్రీయ సూత్రాలను సులభంగా వివరించారు. న్యూటన్ మూడవ గమన సూత్రంపై నిర్వహించిన రాకెట్ ప్రయోగం విద్యార్థులను ఆకట్టుకుంది. ప్రయోగాల ద్వారా శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. అనంతరం కొరియోగ్రాఫర్ శివ విద్యార్థులకు నృత్య విన్యాసాలు నేర్పించారు.

Tags; Increasing scientific awareness among students through science experiments