పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని తూర్పుమొగసాలలో వెలసియున్న శ్రీచాముండేశ్వరిదేవి జయంతి మహ్గత్సవాలు ఆలయంలో సోమవారం జెట్టి కులసంఘ సభ్యులచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని జిడిపప్పు,ద్రాక్ష తో అలంకారించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి నెయ్యిదీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం అమ్మవారి రథోత్సవం, 12న తెప్పోత్సవము నిర్వహించేందుకు ఆలయ కమిటి ఏర్పాట్లు చేపట్టారు.
Tags: Sri Chamundeshwari Devi in special alankara (adornment)