May 11, 2026
Explore
ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు

ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు

May 11, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ప్రమాదవశాత్తు ఆటో చెట్టును ఢీకొని బోల్తా పడటంతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన పట్టణ సమీపంలోని రాంపల్లె వద్ద సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె పట్టణం ఈశ్వరమ్మ కాలనీకి చెందిన నూర్‌బాషా(42), యాస్మిన్‌(35), స్థానిక యూబికాంపౌండుకు చెందిన సుమన్‌తాజ్‌(32) లు కలసి పుంగనూరుకు ఆటోలో వస్తుండగా మార్గ మధ్యంలో రాంపల్లె వద్ద ఆటో చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు గమనించి 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags; Auto Overturns; Three Injured