May 11, 2026
Explore
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి : ఈగిల్ సెల్

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి : ఈగిల్ సెల్

May 11, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా ఈగిల్ సెల్ ఆధ్వర్యంలో మదనపల్లిలోని రైజ్డ్ ఆన్ డెనిమ్ ఇండియా యూనిట్-2లో “డ్రగ్స్ వద్దు బ్రో” పేరుతో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫ్యాక్టరీ కార్మికులకు డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాలపై కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం డ్రగ్స్‌కు సంబంధించిన నేరాలకు కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. డ్రగ్స్ సమాచారం తెలిసిన వారు ఈగిల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా వాట్సాప్ నంబర్ 8688830014కు సమాచారం అందించాలని కోరారు.

Tags; Stay Away from Drugs: Eagle Cell