గండిమడుగు ముచ్చట్లు:
గాలివీడు మండలం గండిమడుగులో విషాద ఘటన చోటుచేసుకుంది. పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండలం టీకుంట్లపల్లికి చెందిన షేక్ నాసిర్(25) కుటుంబ సభ్యులతో కలిసి వెలుగల్లు పార్కును సందర్శించేందుకు వచ్చాడు. అనంతరం సరదాగా ఈతకు దిగగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. సమాచారం అందుకున్న గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులు, ఫైర్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Tags; Young Man Drowns While Swimming