May 11, 2026
Explore
రహదారి వనం మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్

రహదారి వనం మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్

May 11, 2026 | Andhra Pradesh

శ్రీ సత్య సాయి జిల్లా ముచ్చట్లు:

,జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో అటవీశాఖ ఆధ్వర్యంలో సోమవారం భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గణేష్ సర్కిల్ నుండి ఫైర్ స్టేషన్ వరకు ఉన్న రహదారి వనం (Roadside Plantation) మార్గంలో సుమారు 330 మొక్కలను ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు విద్యార్థులు కలిసి నాటారు.కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కల పాత్ర కీలకమని, జిల్లా వ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ పుట్టపర్తిని హరిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డిఎఫ్‌ఓ చక్రపాని, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్, జిల్లా విద్యాశాఖ అధికారి, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా మొక్కలు నాటారు. రహదారి పొడవునా పచ్చదనం వెల్లివిరిసేలా అటవీశాఖ తీసుకున్న ఈ చొరవను స్థానికులు అభినందించారు.

Tags:District Collector A. Shyam Prasad participated in the ‘Rahadari Vanam’ (Roadside Forest) tree-planting program.