బెంగళూరు ముచ్చట్లు:
బెంగళూరుకు చెందిన బిఈఎంఎల్ (BEML) సంస్థ ‘B28’ బుల్లెట్ రైలును రూపొందిస్తోంది. గంటకు 280 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేలా ఈ రైలును డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే ఇది అత్యంత వేగవంతమైనది. 2027 మార్చి నాటికి మొదటి ప్రోటోటైప్ సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, హైస్పీడ్ రైల్వే సాంకేతికతలో భారత్ ప్రపంచ స్థాయి స్వయం సమృద్ధిని సాధించనుంది.
Tags: Is the Indian Bullet Train Ready?