May 11, 2026
Explore
బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహా

బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహా

May 11, 2026 | Andhra Pradesh

అర్థరాత్రి 2 గం.లకు అందిన సమాచారంపై స్పందన

వెల్దుర్తి ముచ్చట్లు:

వెల్దుర్తి మండల పరిధిలోని రామచంద్రాపురం తండాలో ఒక బాల్య వివాహాన్ని ఇంచార్జ్ కలెక్టర్ సంజన సింహా సకాలంలో స్పందించి, అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా విజయవంతంగా అడ్డుకున్నారు.

రామచంద్రాపురం తండాలో ఒక మైనర్ బాలికకు వివాహం జరుగుతున్నట్లు అర్ధరాతి 2 గంటలకు సమాచారం అందుకున్న ఇంచార్జ్ కలెక్టర్, వెంటనే సంబంధిత అధికారులను క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వెల్దుర్తి తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, ఎస్.ఐ, ఐ.సి.డి.ఎస్ మరియు చైల్డ్‌లైన్ ప్రతినిధులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

​అధికారులు బాలిక వయస్సు ధృవీకరణ పత్రాలను పరిశీలించగా, వివాహానికి చట్టబద్ధమైన వయస్సు నిండలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు వెంటనే వివాహాన్ని నిలిపివేసి, బాలికను సంరక్షణలోకి తీసుకున్నారు.

​పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేసే బాల్య వివాహాలను జరపవద్దని ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం వివాహానికి బాలికలకు 18 ఏళ

Tags; In-charge Collector Sanjana Sinha Stops Child Marriage