పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని గత రెండు నెలల క్రితం దేవాదాయశాఖ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం గ్రూపు టెంపుల్ ఈవో రమణ , ఏఎస్‌ఐ అశ్వర్థనారాయణ, భక్తులు కలసి హుండి లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. హుండి ద్వారా రూ.45 వేలు ఆదాయం లభించినట్లు ఈవో తెలిపారు. ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానలో జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగాబాబు తదితరులు పాల్గొన్నారు.
Tags; Maremma’s income is Rs. 45,000.