పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపై గల బెంగళూరు రహదారి పనులను పూర్తి చేయని ఇంజనీర్లు, అధికార పార్టీ కాంట్రాక్టర్ల చర్యలకు నిరసనగా ఈనెల 13 నుంచి బిజెపి నాయకులు నిరాహారదీక్షలు ప్రారంభించనున్నారు. నేతలు అయూబ్‌ఖాన్, నరసింహులు ఆధ్వర్యంలో సోమవారం సీఐ సుబ్బరాయుడుకు వినతిపత్రం అందజేశారు. రోడ్డు మరమ్మతులు చేయని కారణంగా పట్టణంలో దుమ్ముచేరి ప్రజలు ఆనారోగ్యం భారీన పడుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Tags: Protests to begin on the 13th over failure to carry out road works.