పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని సయ్యద్ నూర్‌షావలి బాబా దర్గా వారి ఉరుసు సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్‌రెడ్డిల తరపున చాదర్ సమర్పించి, పూజలు చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము , ముస్లిం నాయకులు ఖాదర్, సిద్ధిక్, కిజర్‌ఖాన్, యూసఫ్, ఇర్ఫాన్ లు కలసి చాదర్, పూలు తీసుకొచ్చి దర్గాలో సమర్పించారు. ఈ సందర్భంగా మత పెద్దలు దువ్వచేసి ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సిపి ముస్లిం నాయకులు అస్లాంమురాధి, న్యామతుల్లా, నజురుల్లా, నయాజ్, జవహార్, నూర్, ఖాన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Chadar presented on behalf of the MLA and MP at the Noor Shahavali Dargah.