తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. పెరంబూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకార ప్రక్రియ పూర్తి చేశారు. విజయ్ పాటు కొత్తగా ఎన్నికైన మిగిలిన సభ్యులు కూడా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన గెలుపొందారు. అయితే, విజయ్ తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు.
Tags: Tamil Nadu CM Vijay Sworn In as MLA