పుంగనూరు ముచ్చట్లు:
డిఎస్సీలో అక్రమాలపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గ కేంద్రంలో సోమవారం వైఎస్సార్‌సిపి ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించనున్నారు. అన్ని మండలాలకు చెందిన పార్టీ నాయకులు , నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీక్యాడర్ పూర్తిస్థాయిలో పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా ఆదివారం కోరారు. అలాగే సీమజిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్ ఆధ్వర్యంలో సీఐ సుబ్బరాయుడును నాయకులు కలసి ర్యాలీకి అనుమతి కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
Tags: Turn out for the YSRCP rally on the 9th.