తిరుపతి
తిరుపతి పట్టణంలోని తిమ్మనాయుడుపాలెం వద్ద నూతనంగా నిర్మించిన మామ్ & మి 60 పడకల ఆసుపత్రినీ శాప్ చైర్మన్ రవి నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ఆసుపత్రిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ, తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కావడానికి ఈ ఆసుపత్రి దోహదపడుతుందని ఆకాంక్షించారు. ఆధునిక వైద్య సదుపాయాలతో 60 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మామ్ & మి ఆసుపత్రి యాజమాన్య సభ్యులు డాక్టర్ రేష్మా రెడ్డి , ప్రభావ తదితరులు పాల్గొన్నారు.
Tags:SAP Chairman Ravi Naidu inaugurates Mom & Me Hospital.