May 11, 2026
Explore
బెంగాల్ సీఎం సహాయకుడి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

బెంగాల్ సీఎం సహాయకుడి హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

May 11, 2026 | Andhra Pradesh

పశ్చిమ బెంగాల్ ముచ్చట్లు:

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కోల్కతా సమీపంలోని బ్యాలీ టోల్ ప్లాజా వద్ద నిందితులు చేసిన UPI చెల్లింపు ఆధారంగా పోలీసులు వారిని గుర్తించారు. ఈ సాంకేతిక ఆధారాలతో ఉత్తరప్రదేశ్, బీహార్లలో గాలింపు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య వెనుక ఉన్న కుట్రపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

Tags: Three arrested in Bengal CM aide murder case.