అమరావతిముచ్చట్లు:
ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2లో భారత మహిళా ఆర్చర్లు సత్తా చాటారు. ఆదివారం జరిగిన మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో దీపిక కుమారి, అంకిత భకత్, కుంకుం మొహద్లతో కూడిన భారత త్రయం అద్భుత విజయాన్ని అందుకుంది. పటిష్టమైన చైనా జట్టుతో జరిగిన ఈ పోరులో 5-4 (28-26) తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 2021 తర్వాత మహిళల రికర్వ్ విభాగంలో భారత్కు ఇదే మొదటి వరల్డ్ కప్ స్వర్ణం కావడం విశేషం.
Tags: India Achieves Grand Victory at Shanghai World Cup