May 11, 2026
Explore
ఏపీకి అల్పపీడనం ముప్పు.. ఈ రోజు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీకి అల్పపీడనం ముప్పు.. ఈ రోజు పిడుగులతో కూడిన వర్షాలు

May 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీనివల్ల ఏపీలో గురువారం వరకు కోస్తాంధ్రలో, మంగళవారం వరకు రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ రోజు మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 30-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

Tags: Low-Pressure Threat Looms Over AP; Thunderstorms Expected Today