May 11, 2026
Explore
ఏపీలోని పాఠశాలల అభివృద్ధికి త్వరలో ‘కనెక్ట్ స్కూల్’!

ఏపీలోని పాఠశాలల అభివృద్ధికి త్వరలో ‘కనెక్ట్ స్కూల్’!

May 11, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీ విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ‘కనెక్ట్ స్కూల్’ (బడి కోసం) పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా పూర్వ విద్యార్థులు, దాతలు స్కూళ్లకు సులభంగా విరాళాలు అందించేందుకు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్, మొబైల్ యాప్ ను కొత్తగా తీసుకురానున్నారు. కంప్యూటర్లు, ఫ్యాన్లు, బెంచీలు, కుర్చీలు వంటి మొత్తం 68 రకాల అవసరమైన వస్తువులను ఎంపిక చేసి ఆన్లైన్లో చెల్లింపు చేయవచ్చు. అనంతరం ఆ సామగ్రిని నేరుగా సంబంధిత ప్రభుత్వ పాఠశాల చిరునామాకు డెలివరీ చేసే విధంగా వ్యవస్థను ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్నారు.

Tags: ‘Connect School’ Coming Soon for the Development of Schools in AP!