అమరావతిముచ్చట్లు:
ప్రపంచవ్యాప్త ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపాలని ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అయితే, ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఈ దిగుమతులకు డాలర్లలో చెల్లింపులు జరుగుతాయి. భారీగా బంగారం కొనడం వల్ల భారత్ చెల్లించాల్సిన దిగుమతి ఖర్చులు పెరిగి, విదేశీ మారకపు నిల్వలు తగ్గిపోతాయి. బంగారం దిగుమతులను తగ్గించుకుంటే భారత రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చు.
Tags: Modi advised against buying gold—is this the reason?