-సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
వారసత్వ హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఒక వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా ఉంటే, సదరు మృతుడి ఆస్తిని పొందేందుకు అతను అనర్హుడని జస్టిస్ పార్దివాలా ధర్మాసనం స్పష్టం చేసింది. మృతుడు వీలునామా రాసినా, నిందితుడికి శిక్ష పడకపోయినా(కన్విక్షన్) హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 25 ప్రకారం ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. “తప్పు చేసిన వాడు దాని ద్వారా ప్రయోజనం పొందకూడదు” అనే సూత్రం ఆధారంగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Tags: An accused in a murder case has no right of inheritance.