May 11, 2026
Explore
ముగిసిన జగన్ యూరప్ టూర్

ముగిసిన జగన్ యూరప్ టూర్

May 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటన ముగించుకుని అర్ధరాత్రి భారత్ కు చేరుకున్నారు. భార్య Y.S.భారతీ రెడ్డితో కలిసి వచ్చిన జగన్ మోహన్ రెడ్డికి బెంగళూరు విమానాశ్రయంలో వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈసారి సాధారణ స్టైల్కు భిన్నంగా జగన్ జీన్స్ షర్ట్, ప్యాంట్లో కనిపించడం చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 26న యూరప్కు వెళ్లిన జగన్ దంపతులు అక్కడ కుమార్తెలతో 15 రోజుల పాటు గడిపారు. ప్రస్తుతం బెంగళూరులో రెండు రోజుల విశ్రాంతి అనంతరం తాడేపల్లికి చేరుకుని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రానున్నట్లు వైస్సార్సీపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags: Jagan’s Europe tour ends