గుంటూరు ముచ్చట్లు:
పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఆదివారం రాత్రి ఫోన్ ఇవ్వలేదనే కారణంతో బంధువుపై తల్వార్ తో దాడి జరిగిన సంఘటన కలకలం రేపింది.
నంబూరు గ్రామానికి చెందిన డ్రైవర్ షేక్.బాషా, తన స్కూటీ, చరవాణిని సమీప బంధువైన షేక్.గౌస్ వద్ద తాకట్టు పెట్టారు.
నగదు చెల్లించినా ఫోన్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వారం రోజులుగా వివాదం నడుస్తోంది.
ఆదివారం రాత్రి సెల్ఫోన్పై వాగ్వాదం జరిగినప్పుడు, గౌస్ రెచ్చగొట్టడంతో బాషా సమీపంలోని ఇంట్లోకి వెళ్లి తల్వార్ తీసుకొని దాడి చేశాడు.
గౌస్ చేయి అడ్డుపెట్టడంతో అరచేయి రెండుగా చీలింది.
తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన గౌస్ ను బాషా తన స్కూటీపై గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి పరారయ్యాడు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు.
Tags: Relative Attacked with Sword for Refusing to Hand Over Phone