May 11, 2026
Explore
ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకాలపై నిషేధం

ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకాలపై నిషేధం

May 11, 2026 | Andhra Pradesh

శ్రీకాకుళం ముచ్చట్లు:

భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని 258 గ్రామాల్లో కొత్త బోర్ల తవ్వకాలపై పూర్తిగా నిషేధం విధించింది.

అలాగే భూగర్భ జలాల వినియోగాన్నీ పరిమితం చేసింది.

ఈ జాబితాలో ప్రకాశం జిల్లాలోని 91 గ్రామాలు,
శ్రీకాకుళం జిల్లాలో 76,
శ్రీ సత్యసాయి జిల్లాలో 39 గ్రామాలు ఉన్నాయి.

అదనంగా పల్నాడు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని మరికొన్ని గ్రామాలను కూడా చేర్చారు.

తాగునీటి అవసరాల కోసం చేతి పంపుల ఏర్పాటు మినహా కొత్త బోర్లు, ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags: Ban on Borewell Drilling in 258 Villages in AP