May 10, 2026
Explore
అప్పయ్యరాజుపేటలో ముస్లిం సోదరులతో సమావేశం

అప్పయ్యరాజుపేటలో ముస్లిం సోదరులతో సమావేశం

May 10, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

  • పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పోలీసుల సూచనలు.
  • వదంతులను నమ్మకుండా, అనుమానాస్పద విషయాలను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు పుల్లంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు అధికారులు చేపట్టారు.

ఈ నేపథ్యంలో ఈరోజు పుల్లంపేట మండల పరిధిలోని అప్పయ్యరాజుపేట గ్రామంలో మండలంలోని ముస్లిం సోదరులు రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొని పండుగను సామరస్యపూర్వకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు.

పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలో లేదా మండల పరిధిలో ఏవైనా ప్రత్యేక పరిస్థితులు, అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

అలాగే సామాజిక మాధ్యమాలు లేదా ఇతర మార్గాల ద్వారా వ్యాపించే వదంతులను నమ్మవద్దని, ఎలాంటి వదంతులు వినిపించినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
ప్రజలందరూ పరస్పర సహకారంతో శాంతి భద్రతలను కాపాడుతూ బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.

Tags; Meeting with Muslim Brothers in Appayyarajupeta